: వారినెందుకు తొలగించారు?: ఆన్ లైన్ లో ‘ఆప్’పై వలంటీర్ల ప్రశ్నల వర్షం
ఢిల్లీ అసెంబ్లీలో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆది నుంచి బాసటగా నిలిచిన వలంటీర్ల నుంచి ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతోంది. కేజ్రీవాల్ జోడు పదవులపై గళమెత్తిన యోగేంద్ర యాదవ్ తో పాటు పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యుడైన ప్రశాంత్ భూషణ్ లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాక, యోగేంద్ర వ్యాఖ్యల నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యోగేంద్ర, భూషణ్ లను పీఏసీ నుంచి తొలగించడంపై పార్టీ వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వారినెందుకు తొలగించారో చెప్పండి?’’ అంటూ ఆన్ లైన్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే పార్టీ ఇప్పటిదాకా ఈ ప్రశ్నలకు బదులివ్వలేదు.