: పెదగంజాం భావనారాయణస్వామి ఆలయంలో ఆవిష్కృతమైన అపురూప దృశ్యం
ప్రకాశం జిల్లా పెదగంజాం గ్రామంలోని అత్యంత పురాతన శ్రీదేవి, భూదేవి సహిత శ్రీభావనారాయణస్వామి ఆలయంలో ఈ ఉదయం అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం సూర్యోదయ సమయాన కిరణాలు స్వామివారి మూలమూర్తిపై ప్రసరించాయి. ఈ అపురూప, అద్భుత దృశ్యాన్ని భక్తులు తిలకించి ఆనందించారు. ఆలయ నిర్మాణంలో విశిష్టత కారణంగా, ఏటా మార్చి మొదటి పక్షంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల భక్తులు తరలివచ్చి భావనారాయణ స్వామిని దర్శంచుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.