: లక్ష్యం రూ.10 వేల కోట్లు... రాబడి రూ.800 కోట్లే!: క్రమబద్ధీకరణలో టీ సర్కారుకు షాక్


ఆర్థిక వనరుల సమీకరణలో తెలంగాణ సర్కారుకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విభజన సమయంలో మిగులు బడ్జెట్ తో సంబరాలు చేసుకున్న కేసీఆర్ సర్కారు, ఏడాది తిరక్కముందే లోటు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన దుస్థితి రావడంతో సంకట స్థితిని ఎదుర్కుంటోంది. ఆదాయం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సర్కారు తలపట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భూముల క్రమబద్ధీకరణ అంశం కూడా తెలంగాణ సర్కారును భారీ దెబ్బ కొట్టింది. భూముల రెగ్యులరైజేషన్ తో ఖజానాకు భారీగా నిధులు వస్తాయనుకున్న తెలంగాణ ప్రభుత్వం, వాస్తవ పరిస్థితి చూసి కంగుతింది. క్రమబద్ధీకరణ ద్వారా ఎంతలేదన్నా రూ.10 వేల కోట్ల మేర రాబడి వస్తుందని సర్కారు భావించగా, కేవలం రూ.800 కోట్లే రానున్నాయని తేలడంతో నోట మాట రావడం లేదు. బడ్జెట్ కసరత్తులో భాగంగా వెలుగు చూసిన ఈ విషయంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ తగ్గుదల ఈ నెల 11న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై పెను ప్రభావాన్నే చూపనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News