: జయకు అంత ఆస్తి ఎక్కడిది?: విలువ అధికంగా చూపారంటూ హైకోర్టు ఆగ్రహం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారంటూ, ప్రభుత్వ అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టు అధికారుల తీరును తప్పు పట్టింది. 1994లో రూ. 150 లోపున్న మార్బుల్ ధరను రూ. 5,000గా లెక్కిస్తే ఎలా? అని హైకోర్టు ప్రశ్నించింది. తమ ఆస్తుల విలువను అధికంగా చూపారని జయలలిత సహా మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ సీ.ఆర్.కుమారస్వామి తమిళనాడు అధికారుల తీరును తప్పుబట్టారు.