: ‘ఎలిమినేటి’కి నివాళి... అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళి అర్పించిన ఆయన, బషీర్ బాగ్ లోని మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి మాధవ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. నక్సలైట్లు మాధవరెడ్డిని హత్య చేసి పెద్ద పొరపాటు చేశారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News