: ‘ఎర్ర’ స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తుల విలువ రూ.100 కోట్లట... జప్తు చేసేందుకు సీఐడీ చర్యలు


ఎర్రచందనం దుంగలను అక్రమ మార్గాల్లో దేశ సరిహద్దులను దాటించి పోలీసులకే సవాల్ విసిరిన స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. కడప జిల్లాలోని తన సొంతూరు పుల్లంపేటతో పాటు పరిసర ప్రాంతాలు, తిరుపతి, చెన్నైల్లో గంగిరెడ్డి భారీగా ఆస్తులను కూడబెట్టాడు. ఇటీవల అరెస్టైన గంగిరెడ్డి ఆస్తులపై ఆరా తీసిన సీఐడీ పోలీసులు అతడు కూడబెట్టిన రూ.100 కోట్ల విలువ చేసే సంపదను చూసి షాక్ కు గురయ్యారట. భార్య, సోదరుల పేరిట అతడు వందల ఎకరాల భూములను కొనుగోలు చేశాడు. వీటిన్నింటి వివరాలను సేకరించిన పోలీసులు, వాటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డి ఏపీ సీఐడీ అధికారుల చర్యతో షాక్ తిన్నాడు. అతడిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు పోలీసుల బృందం మారిషస్ వెళ్లింది.

  • Loading...

More Telugu News