: దుబాయ్ షేక్ చెర నుంచి ఆంధ్రా మహిళలను రక్షించేందుకు ఏపీ సర్కారు చర్యలు


ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లిన ఐదుగురు ఆంధ్రా మహిళలను అరబ్ షేక్ నిర్బంధించిన విషయం విదితమే. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి సదరు మహిళలను దుబాయి పంపిన మొగల్తూరుకు చెందిన త్రిమూర్తులు అనే ఏజెంట్, ఆ తర్వాత వారి గురించి పట్టించుకోలేదు. సదరు మహిళలను పనిలో కుదుర్చుకున్న అరబ్ షేక్ వికృత చేష్ఠలకు దిగాడు. వ్యభిచారం చేయండని వారిపై తీవ్ర ఒత్తిడి చేశాడు. ఎలాగోలా సదరు మహిళలు తమ దీన గాథను ఏపీ సర్కారుకు తెలియజేయడంతో పాటు తమను ఆ నరక కూపం నుంచి రక్షించండని మొరపెట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మహిళలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మొగల్తూరు ఏజెంట్ త్రిమూర్తులుపై కేసు నమోదు చేయమని ఆదేశించారు.

  • Loading...

More Telugu News