: ఎంపీ గారూ... ఎవరి వల్ల గెలిచారు?: అరకు ఎంపీని నిలదీసిన వైసీపీ కార్యకర్తలు
అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతకు నిన్న తన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎవరి వల్ల ఎంపీ పదవి దక్కిందో చెప్పాలంటూ నిలదీసిన వైసీపీ కార్యకర్తలకు ఆమె సమాధానం చెప్పలేకపోయారు. మౌనంగా కూర్చుండిపోయారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్తపల్లి గీత, ఆ తర్వాత టీడీపీ పంచన చేరిపోయిన సంగతి తెలిసిందే. అరకు లోక్ సభ నియోకవర్గ పరిధిలోని విజయనగరం జిల్లా కురుపాంలో అభివృద్ధి పనులపై నిన్న అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ హోదాలో కొత్తపల్లి గీత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘‘ఎవరి వల్ల ఎంపీగా గెలిచారు?’’ అంటూ వైసీపీ కార్యకర్తలు ఆమెను నిలదీశారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఎంపీ, మౌనంగా కూర్చుండిపోయారు.