: 'తెలంగాణ టుడే'... కేసీఆర్ కొత్త దినపత్రిక?
తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందిన 'నమస్తే తెలంగాణ' దినపత్రిక, 'టి న్యూస్' చానల్ వెనుక కేసీఆర్ కుటుంబం ఉందన్నది తెలిసిన విషయమే. సొంత మీడియా సాయంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ ఓ ఆంగ్ల దినపత్రికను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. 'తెలంగాణ టుడే' పేరిట ఈ పేపర్ ను తీసుకువస్తున్నట్టు సీఎం సన్నిహితులు చెబుతున్నారు. ఈ దినపత్రిక మరో రెండుమూడు నెలల్లో రానుందట. 2011లో ప్రారంభమైన 'నమస్తే తెలంగాణ' పేపర్ ప్రస్తుతం తెలంగాణలో ప్రజాదరణ పొందింది. దీనికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ లో యూనిట్లున్నాయి. ఆంగ్ల దినపత్రికను ఈ యూనిట్లలో కొన్నింటి ద్వారా ప్రచురించే అవకాశాలు కనిపిస్తున్నాయి.