: 130 మందితో రన్ వే నుంచి జారిపోయిన విమానం


అట్లాంటా నుంచి న్యూయార్క్ చేరుకున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం అక్కడి లా గార్డియా విమానాశ్రయంలో కురిసిన మంచు కారణంగా రన్ వే నుంచి పక్కకి జారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు తుపాను కారణంగా ఆ ప్రాంతంలో విపరీతంగా మంచు పేరుకుపోయింది. కాగా, జారిపోయిన విమానంలో 125 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు, విమానాన్ని రన్ వేపై చేర్చేందుకు శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News