: దుబాయ్ షేక్ చెరలో ఏపీ మహిళలు... వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఏపీ మహిళలు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఓ దుబాయ్ షేక్ చెరలో ఉన్న ఐదుగురు మహిళలు అతికష్టం మీద మీడియాకు వివరాలు తెలిపారు. బాధిత మహిళల్లో ఇద్దరు రాజమండ్రికి చెందినవారు కాగా, ఇద్దరు అమలాపురానికి చెందినవారు. మరో మహిళది విశాఖపట్నం. మొగల్తూరుకు చెందిన త్రిమూర్తులు అనే ఏజెంట్ ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి టూరిస్టు వీసాపై దుబాయ్ పంపాడు. అయితే, దుబాయ్ షేక్ వారికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడట. దానికితోడు, వ్యభిచారం చేయాలంటూ ఏజెంట్, దుబాయ్ షేక్ ఒత్తిడి చేస్తున్నారని మహిళలు పేర్కొన్నారు. తమను రాష్ట్రానికి తీసుకెళ్లమని ఏజెంట్ ను వేడుకున్నా ఫలితం శూన్యమని వారు వాపోయారు.