: స్వార్థంతోనే బాబు సింగపూర్ ప్రభుత్వానికి భూమి అప్పగిస్తున్నారు: బొత్స
స్వార్థ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగపూర్ ప్రభుత్వానికి పది వేల ఎకరాల ఏపీ రాజధాని భూములను అప్పగించడం సరికాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన ప్రతి హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.