: శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు బస్సులు ఢీ... లోయలో పడ్డ బస్సు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీ కొట్టింది. దీంతో, అదుపుతప్పిన ఒక ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో, బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులతో కలిసి, ఢీ కొట్టిన బస్సులోని ప్రయాణికులు రక్షించారు. గాయాలపాలైన ప్రయాణికులను హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.