: 'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' రేసులో సచిన్, ధోనీ
భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఆల్ టైమ్ 'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' రేసులో నిలిచారు. వీరిద్దరే కాక, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్, విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కూడా తుది జాబితాలో ఉన్నారు. ఈ జాబితా నుంచి వచ్చే వారం విజేతను ఎంపిక చేస్తారు. విజేతను ఎంపిక చేసే జ్యూరీలో క్రికెటర్లతో పాటు, కామెంటేటర్లు, క్రికెట్ రచయితలు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ ఈఎస్పీఎన్ క్రికిన్ఫో ఆధ్వర్యంలోని 'క్రికెట్ మంత్లీ' మేగజైన్ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది.