: బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించే భారత మహిళలు ఆరోగ్యం గురించి పట్టించుకోరట!


భారత స్త్రీలు విభిన్న బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు కానీ, ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరని ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపింది. భారత మహిళలపై ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఆన్ లైన్ సర్వే నిర్వహించగా, అందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. భారత మహిళల్లో 39 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా సౌకర్యం ఉందని ఆ సంస్థ తెలిపింది. వారిలోనూ తమ కోసం బీమా చేయించుకున్నవారు కేవలం 22 శాతమేనట. యాజమాన్యాలు కల్పించిన ఆరోగ్య బీమా సౌకర్యం కలిగిన వారు 16 శాతం మంది ఉన్నారట. బీమా ఉన్నప్పటికీ దాని వల్ల కలిగే లాభనష్టాలు, షరతుల గురించి తెలియని వారు 40 శాతం మంది ఉన్నారని ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపింది. బీమా ఆలోచనే లేని మహిళలు 53 శాతం మంది అని సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News