: కోర్టులో స్పృహ తప్పిపడిపోయిన 'మరోచరిత్ర' హీరోయిన్ సరిత


'మరోచరిత్ర' హీరోయిన్ సరిత న్యాయస్థానంలో స్పృహతప్పి పడిపోయింది. దీంతో, కోర్టులో కాసేపు కలకలం రేగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సరిత మలయాళ నటుడు ముఖేష్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ క్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 2009లో ముఖేష్ విడాకులకు దరఖాస్తు చేశారు. సుదీర్ఘకాలం సాగిన ఈ కేసులో రెండేళ్ల క్రితం వారికి విడాకులు మంజూరయ్యాయి. అనంతరం మిధుల అనే ఆమెను ముఖేష్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సరిత... తాను పిల్లల చదువుకోసం దుబాయ్ లో ఉండగా, న్యాయస్థానానికి హాజరుకాలేని పరిస్థితుల్లో తనకు విడాకులు మంజూరయ్యాయని, వాటిని రద్దు చేసి, ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పునివ్వాలని పేర్కొంటూ పిటిషన్ వేసింది. అది విచారణకు రావడంతో కోర్టు బోనులోంచి తన వాదన వినిపించిన సరిత అనంతరం స్పృహ తప్పిపడిపోయింది. దీంతో, వెంటనే స్పందించిన సన్నిహితులు సపర్యలు చేసి సరితను ఇంటికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News