: రజనీకాంత్ లో కనిపించని హోలీ జోష్
హోలీ పండుగ అంటే ఎవరికి ఉత్సాహం ఉండదు చెప్పండి! అందరిలోనూ జోష్ తీసుకువచ్చే ఈ పండుగ అంటే దేశవ్యాప్తంగా పెద్దలు, పిన్నలు ఆసక్తి ప్రదర్శిస్తారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హోలీని ప్రతి ఏడాది సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం ఆయనలో హోలీ జోష్ కనిపించడంలేదు. అందుకు కారణం, గురువుగా భావించే దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ మృతి చెందడమే. ప్రతి ఏడాది హోలీ నాడు గురువుకు శుభాకాంక్షలు తెలపడం రజనీకి ఆనవాయితీ. తనను సినీ రంగానికి పరిచయం చేసిన బాలచందర్ అంటే రజనీకి గురుభక్తి. ఓ సాధారణ బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ కాస్తా రజనీకాంత్ అయింది సరిగ్గా హోలీ నాడే. 'రజనీకాంత్' అనే పేరును బాలచందరే సూచించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో లేకపోవడం రజనీకాంత్ ను వేదనకు గురిచేసిందట. అనారోగ్యం కారణంగా బాలచందర్ ఇటీవల మరణించడం విదితమే.