: డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డికి బెయిల్ నిరాకరణ
డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. కెనరా బ్యాంకును మోసం చేశారన్న కేసులో అరెస్టైన ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. రూ. 357 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనపై ఐపీసీ 120-బి, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ వెంకట్రామిరెడ్డిదే.