: హీరోయిన్ ని కాపాడి హీరో అనిపించుకున్న హాస్యనటుడు
తమిళ హాస్యనటుడు కరుణాకరన్ ఓ హీరోయిన్ ని కాపాడి నిజజీవితంలో హీరోగా నిలిచాడు. పాశ్చాత్య మోడలింగ్ ప్రపంచం నుంచి భారత సినీ రంగానికి దిగుమతైన ఎమీ జాక్సన్ 'ఐ' సినిమా తరువాత మరో సినిమాలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు తిరుకుమరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. షూట్ లో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో ఎమీ జాక్సన్ తాను రైడ్ చేస్తున్న బైక్ నుంచి కిందపడిపోయిందట. అలా జారిపోతూ కొండమీద నుంచి కిందికి పడబోయిందట. వెనకాలే వస్తున్న కరుణాకరన్ ఇది గమనించి ఆమెను కాపాడాడు. దీంతో ఎమీ అతనికి కృతజ్ఞతలు చెప్పింది.