: హోలీ ఆడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం హైదరాబాదులోని చంద్రబాబు నివాసం వద్ద హోలీ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. గిరిజన మహిళలు కూడా బాబు ఇంటి వద్దకు చేరుకుని హోలీ ఆడారు. చంద్రబాబు కూడా వారితో కలసి ఉత్సాహంగా హోలీ ఆడారు. ఈ సందర్భంగా, రంగులు, డ్యాన్సులతో చంద్రబాబు నివాసం కళకళలాడింది.