: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా షాహిద్ కపూర్
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే షాహిద్ కపూర్ అనడంతో సందేహం లేదు. గతేడాది 'హైదర్' విజయవంతమైన తరువాత షాహిద్ తో సినిమాలు తీసేందుకు దర్శకులు వరుస కడుతుంటే, మరోవైపు ఈ హ్యాండ్ సమ్ హీరోను పెళ్లి చేసుకోవాలని పలువురు తహతహలాడుతున్నారు. ఏ హీరోను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడతారన్న విషయంపై ఇటీవల ఓ సోషల్ మీడియా కంపెనీ ఆన్ లైన్ పోలింగ్ నిర్వహించింది. అందులో పలువురి నుంచి అద్భుతమైన స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో షాహిద్ ని పెళ్లి చేసుకునేందుకే గరిష్ట సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయట. అయితే బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా రెండింటిలోనూ యువతులు షాహిద్ నే కోరుకోవడం చాలా విశేషమని సర్వే అంటోంది.