: స్వల్ప విమాన ప్రమాదం... హాలీవుడ్ నటుడు హారిసన్ కు గాయాలు
లాస్ ఏంజెలెస్ లో జరిగిన చిన్న విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు సీట్లున్న చిన్న విమానాన్ని తానే నడుపుకుంటూ వెళ్లి ఆయన స్థానిక ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తున్న సమయంలో గోల్ఫ్ కోర్టులో విమానం క్రాష్ అయిందని, దాంతో ఫోర్డ్ తలకు బలమైన గాయాలైనట్టు, చికిత్స కోసం వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు అక్కడి పోలీస్ విభాగ ప్రతినిధి మహిళా అధికారి వివరించారు. ఈ ఘటన మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో జరిగినట్టు అనుమానిస్తుండగా, మెకానికల్ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. 'ఇండియానా జోన్స్' చిత్రం ద్వారా హాలీవుడ్ లో పాప్యులారిటీ సంపాదించుకున్న హారిసన్ పలు సినిమాల్లో నటించారు.