: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం... హామీలను కేంద్రం నెరవేస్తుంది: ఎంపీ హరిబాబు


విభజన చట్టం హామీల అమలుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని విశాఖ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత హరిబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించేందుకు ఎంపీలమంతా కలసికట్టుగా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేసే విషయంలో ఇప్పటికే కేంద్రం కార్యాచరణ ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఏపీని అభివృద్ధి బాటలో నడిపేందుకు మోదీ సర్కారు కృత నిశ్చయంతో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News