: షమీ దెబ్బకు క్రిస్ గేల్, ఉమేష్ దెబ్బకు రామ్ దిన్ ఔట్
భారత పేస్ బౌలర్ల దెబ్బకు విండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అద్భుత ఫాంలో ఉన్న మహమ్మద్ షమీ ప్రపంచకప్ లో వీరవిహారం చేస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ వికెట్ తీసిన షమీ... డేంజరస్ క్రిస్ గేల్ ను కూడా పెవిలియన్ చేర్చాడు. షమీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన గేల్... మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రామ్ దిన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 38 పరుగులు. సిమన్స్, కార్టర్ లు క్రీజులో ఉన్నారు.