: ఈ నెల 10 నుంచి మోదీ విదేశీ పర్యటనలు


ఈ ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెలలో ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న ఢిల్లీ నుంచి బయలుదేరి సీషెల్స్, మారిషస్, శ్రీలంకలో ప్రధాని పర్యటించబోతున్నట్టు వెల్లడించింది. ఈ నెల 11న సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలెక్సిస్ మైఖేల్ తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అదేరోజు, 12న మారిషస్ లో పర్యటిస్తారు. 13, 14న శ్రీలంకలో పర్యటించి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఇతర నేతలతో భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News