: సినీనటి శారదకు గాయాలు... అదుపు తప్పిన కారు
ప్రముఖ సినీనటి శారద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయింది. ఈ ఘటలో శారదకు స్వలంగా గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదులో జరుగుతోన్న సినిమా షూటింగులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారుకు ఒక్కసారిగా గేదెలు అడ్డురావడంతో, కారును పక్కకు తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.