: ఇంటర్నెట్ లో 30 మంది ప్రభావశీలుర జాబితాలో మోదీ... టైమ్ మేగజీన్ ప్రకటన


నిత్యం ట్విట్టర్ తో అనుసంధానమై ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు. ఇంటర్నెట్ ను ప్రభావితం చేస్తున్న 30 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు టైమ్ మేగజీన్ జాబితాను విడుదల చేసింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్, పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్, బేయాన్స్ లు ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో 3.8 కోట్ల మంది ఫాలోయర్లను కలిగిన మోదీ, తన సందేశాలను ప్రజలకు చేరవేయడంలో విజయవంతమయ్యారని టైమ్ మేగజీన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News