: పెనుమాక, బేతపూడి, ఉండవల్లి గ్రామాలను రాజధాని ప్రణాళిక నుంచి తప్పించాలి: పవన్


రాజధాని ప్రాంతంలో ఉన్న పెనుమాక, బేతపూడి, ఉండవల్లి గ్రామాలను రాజధాని ప్రణాళిక నుంచి తప్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వీలైతే ఆ గ్రామాల సమస్యలపై కమిటీ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కమిటీ వేసి గ్రామాల ప్రజల సమస్యలు విని సామరస్యంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విధివిధానాలు మార్చాలని తాను చెప్పట్లేదని, అభివృద్ధికి తాను వ్యతిరేకంగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఇక 33వేల ఎకరాలను ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పాలని, రైతు కూలీలకు ఎలాంటి సాయం చేస్తారో ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. అంతేగాక స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు రాజ్యాంగ ప్రకారం ఎలాంటి భద్రత కల్పిస్తున్నారో కూడా చెప్పాలన్నారు. వాన్ పిక్ భూముల్లో ఎన్నో అవకతవకలు జరిగాయన్న జనసేన అధినేత, వేలకోట్లు దోచుకున్నవారి భూములకు రక్షణ ఉందని, రైతుల భూములకు మాత్రం ఎలాంటి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News