: మోదీకి టెన్నిస్ రాకెట్లను బహుమతిగా ఇచ్చిన పేస్, మార్టినా హింగిస్
ప్రధాని నరేంద్ర మోదీని నిన్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మోదీకి రెండు టెన్నిస్ రాకెట్లను అందజేశారు. వాటిని అత్యంత మురిపెంగా అందుకున్న మోదీ, ఆ తర్వాత వాటి ప్రాముఖ్యతను గురించి ట్విట్టర్ లో తెలిపారు. సదరు రాకెట్లు కొత్తవి కావు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ బరిలో హింగిస్, పేస్ లు వినియోగించిన రాకెట్లట. వాటిపై సంతకాలు చేసి మరీ వారు సదరు రాకెట్లకు మోదీకి అందించారు.