: 11 గంటలకు పవన్ మీడియా సమావేశం
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని, ప్రజల తరపున పోరాటం చేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మీడియా సమావేశంలో ఏ విషయాలపై మాట్లాడనున్నారు, పార్టీ తరపున భవిష్యత్ ఏమైనా ప్రకటిస్తారా? అన్న క్రమంలో ఈ మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.