: బీహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత రామ్ సుందర్ దాస్ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 95 సంవత్సరాలు. గతకొంత కాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఈయన బాధ పడుతున్నారు. ఈ ఉదయం ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్ సుందర్ దాస్ మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామ్ సుందర్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందారు.