: గర్భిణిని బలిగొన్న స్వైన్ ఫ్లూ


రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వీరవిహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మహమ్మారి ఓ నిండు గర్భిణిని బలిగొంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం సిరగాపురం గ్రామంలో గర్భిణి అయిన పల్లవి (22) ఈ రోజు మృతి చెందింది. మూడు రోజుల క్రితం కర్నూలు ఆసుపత్రిలో పల్లవికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు... ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. అనంతరం ఆమెకు వైద్యం అందించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. పల్లవి మృతితో సిరగాపురంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News