: బెజవాడ కారు డ్రైవర్ మణికంఠ నలుగురికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు!


కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న బెజవాడ యువకుడు మణికంఠ, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. అంటే, దాదాపుగా మృతి చెందినట్లే. విధిని ఎదిరించలేం కదా. అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే వెనువెంటనే వారిలో ఓ మెరుపు లాంటి ఆలోచన మెదిలింది. అంతటి శోకంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురికి కొత్త జీవితాలను ప్రసాదించనుంది. కొత్త జీవితాలనే కాదు నిండు నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించనుంది. మణికంఠ అవయవాలను దానం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయంతో వైద్యులు సత్వర చర్యలు చేపట్టారు. మణికంఠ గుండె, కాలేయం, కళ్లు, మూత్రపిండాలను దానం చేయాలని అతడి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో రంగంలోకి దిగిన మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వైద్యులు, మణికంఠ అవయవాలను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేసిన వైద్యులు, మణికంఠ అవయవాలను చెన్నైలో చికిత్స పొందుతున్న నలుగురికి అమర్చి వారికి కొత్త జీవితాలను ప్రసాదించనున్నారు.

  • Loading...

More Telugu News