: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే... పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్ ల విభజన


రాష్ట్ర విభజన తర్వాత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల విభజనను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిన్న పూర్తి చేసింది. ఐఏఎస్ అధికారుల విభజనలో భాగంగా 161 మందిని ఏపీకి కేటాయించిన మోదీ సర్కారు, 133 మందిని తెలంగాణకు పంపింది. ఇక ఐపీఎస్ అధికారుల్లో 116 మందిని ఏపీకి పంపించిన కేంద్రం, 95 మందిని తెలంగాణకు కేటాయించింది. విభజనకు సంబంధించి అధికారుల నుంచి ఆప్షన్లు స్వీకరించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ, జీహెచ్ఎంఎసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పట్ల మాత్రం దయ చూపలేదు. తనను తెలంగాణకే కేటాయించాలని 1989 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అంతేకాక తాననుకున్న రాష్ట్రంలో సేవలందించేందుకు ఆయన క్యాట్ నూ ఆశ్రయించారు. అయినా ఆయన అభీష్టం నెరవేరలేదు. సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News