: ఢిల్లీ హోలీ రంగుల్లో రాజ్ నాథ్... దేశవ్యాప్తంగా ఉత్సాహంగా రంగుల కేళీ!
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రంగుల కేళీ ఉత్సాహంగా సాగుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వచ్చిన యువత రంగులతో కేరింతలు కొడుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ప్రధాన నగరాలు నాగ్ పూర్, ముంబై, ఫుణే, కోల్ కతా బెంగళూరు తదితర నగరాల్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ యువతతో పోటీ పడి మరీ హోలీ జరుపుకున్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు మొదలయ్యాయి. ఏపీలోని విశాఖలోనూ హోలీ వేడుకలు హోరెత్తుతున్నాయి. విశాఖ తీరంలో యువత కేరింతలు కొడుతోంది.