: జేపీ... కొంగ జపం ఆపు!: లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ
లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయ చదరంగంలోకి దూకిన జయప్రకాశ్ నారాయణపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ ఫైరయ్యారు. ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ పేరిట గుంటూరులో నిర్వహించిన ఆందోళనలో భాగంగా నిన్న వర్మ, జేపీపై నిప్పులు చెరిగారు. విశాఖలో జేపీ చేపట్టిన దీక్షలో ప్రధాన డిమాండ్లలో ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాక జేపీ దీక్ష, బీజేపీ సంకల్ప దీక్షలను తలపిస్తోందని వర్మ ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ జేపీ నిన్న విశాఖలో దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాను విస్మరించిన జేపీ ఎందుకోసం దీక్ష చేస్తున్నారని ప్రశ్నించిన వర్మ, దీక్షల పేరిట జేపీ కొంగ జపాలను కట్టిపెట్టాలని హెచ్చరించారు.