: యూట్యూబ్ లో ‘బాల భైరవ’ వీడియో హల్ చల్... ఆ బాలుడి కోసం రాంచరణ్ వెతుకులాట!


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంపై తెలుగు నేలలో నేటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ‘బాల భైరవ’ వీడియోనే ఇందుకు నిదర్శనం. రాంచరణ్ తేజ్ ను ఓ స్థాయిలో నిలబెట్టిన సదరు చిత్రంలో కథానాయకుడు, షేర్ ఖాన్ ల మధ్య సాగే సవాల్, ప్రతిసవాళ్లు ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతున్నాయి. సదరు సుదీర్ఘ డైలాగ్ ను ఓ బాలుడు గుక్కతిప్పుకోకుండా చెప్పేశాడు. సదరు వీడియోనే ‘బాల భైరవ’ పేరిట యూట్యూబ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిని చూసిన చిత్ర కథానాయకుడు రాంచరణ్ తేజ్ మైమరచిపోయాడట. ‘‘వీడియోలో ఉన్న బాలుడెవరో వెతికిపెట్టండి. అతడిని కలవాలనుంది’’ అంటూ తన అనుచరులను పురమాయించాడట.

  • Loading...

More Telugu News