: వారికి ఓట్లేయమని చెప్పారుగా... దమ్ముంటే ఢిల్లీలో ధర్నాకు దిగు: పవన్ కు సీపీఐ రామకృష్ణ సవాల్
‘‘రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి ఓట్లేయమని నాడు చెప్పారుగా. రాష్ట్ర విభజనపై జరిగిన మోసాలపై దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేపట్టండి’’ అంటూ సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. బెజవాడలో మూడు రోజుల పాటు కొనసాగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు నిన్న ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తదితర అంశాల్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ సర్కారు పాల్పడుతున్న విభజన మోసాలపై పవన్ కల్యాణ్ ఢిల్లీలో ధర్నా చేయాలని ఆయన సవాల్ విసిరారు.