: షుగర్ వినియోగం తగ్గించండి...సమస్యలు పరిష్కారమవుతాయి: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఊబకాయం సమస్యను పరిష్కరించేందుకు షుగర్ వినియోగం తగ్గించడమే మార్గమని డబ్ల్యూహెఓ పేర్కొంది. ఈ మేరకు షుగర్ వాడకంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో రోజువారీ వాడకంలో షుగర్ 10 శాతం మించకూడదని చెప్పిన డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు దానిని కేవలం 5 శాతనికే పరిమితం చేసింది. దీంతో రోజుకు సగటున 25 గ్రాముల షుగర్ కంటే ఎక్కువ తీసుకోవద్దని సూచించింది. అంటే రోజుకు ఆరు టీ స్పూనుల షుగర్ కంటే ఎక్కవ తీసుకోకూడదు. అయితే పండ్లు, షుగర్ కలపని పండ్ల రసాలు, పాలలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు ఎలాంటి హాని చూపవని స్పష్టం చేసింది. పానీయాలలో కలిపే షుగర్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివే శరీరానికి హానికరమని, ఊబకాయానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.