: నరైన్ లేకపోవడమే పెద్దలోటు... అతను ఉంటే విజయాలే!: క్లైవ్ లాయిడ్
సునీల్ నరైన్ లేకపోవడమే పెద్దలోటని వెస్టిండీస్ మొత్తం అభిప్రాయపడుతోంది. విండీస్ తాజాలు, మాజీలు, సెలక్టర్లు, అభిమానులు అంతా నరైన్ జపం చేస్తున్నారు. వరల్డ్ కప్ లో 300 పైచిలుకు స్కోర్లు చేస్తున్నా వాటిని కాపాడుకోలేకపోవడానికి కారణం వైవిధ్యమైన బౌలింగ్ లేకపోవడమేనని వారు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో నరైన్ ఒకడని, అతను లేకపోవడంతోనే భారీ స్కోర్లను కాపాడుకోలేకపోతున్నామని క్లైవ్ లాయిడ్ తెలిపాడు. నరైన్ ఉండి ఉంటే ఫలితాలు తారుమారు అయ్యేవని ఆయన పేర్కొన్నారు. విండీస్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తే, అడ్డుకోవడం ఎవరి తరమూకాదని ఆయన తెలిపారు.