: ప్రపంచంలో మరెక్కడా ఇలా చేయలేదు...పవన్ కల్యాణ్ ఉద్దేశం తెలీదు: అచ్చెన్నాయుడు


ఎలాంటి చట్టం చేయకుండా 33 వేల ఎకరాలు సేకరించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును నమ్మి వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధాని కోసం ఇస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయం ప్రకారం రైతులను తప్పుదోవపట్టించేందుకు ఏదో ప్రయత్నం జరుగుతోందని అన్నారు. పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. తాజా బడ్జెట్ లో క్రీడా రంగానికి వెయ్యి కోట్లు కేటాయించామని ఆయన చెప్పారు. తిరుపతి, విశాఖ, విజయవాడ పట్టణాల్లో అంతర్జాతీయ స్టేడియంలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News