: అసెంబ్లీ పరిధిలోని 2 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీకి 2 కిలోమీటర్ల పరిధిలో పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నిషేధాజ్ఞలు విధించారు. అసెంబ్లీకి చుట్టుపక్కల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు నిషేధించినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 13వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. నిషేధిత ప్రాంతంలో ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.