: మామగారి పైశాచికం...కోడలి తాళిని తెంచి దగ్ధం చేశాడు


ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో ఆమె మెడలోని తాళిబొట్టును భర్త తండ్రి తెంచి దగ్ధం చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే... సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పన్నపట్టికి చెందిన పళణిస్వామి కుమారుడు గోవింద (22) సేలంలోని ఓ జౌళి దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే దుకాణంలో పని చేస్తున్న దివ్య (19) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత 'సఖి' సినిమాలోలా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. తరువాత విషయం తెలుసుకున్న పళణిస్వామి తన కుమారుడిని ఇంట్లోనే బంధించి పని మాన్పించాడు. స్నేహితుల సహాయంతో ఇంటి నుంచి బయటపడ్డ గోవింద చట్టబద్ధంగా వివాహం చేసుకునేందుకు దివ్యను తీసుకుని రిజిస్టర్ కార్యాలయానికి బయల్దేరారు. విషయం తెలుసుకున్న పళణిస్వామి ప్రేమికులను వేటాడి, వారిపై దాడి చేసి దివ్య మెడలోని తాళిబొట్టును తెంచి దగ్ధం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్రేమికులు, పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గోవింద ఓ దుకాణంలోని పసుపుతాడు తీసుకుని, పసుపుకొమ్ముతో దివ్య మెడలో దానిని కట్టాడు. వారికి పోలీసులు ఆశ్రయం కల్పించి రిజిస్టర్ వివాహం చేశారు.

  • Loading...

More Telugu News