: కేసీఆర్ ఇంటి ముందు కూడా చావు డప్పు మోగిస్తారు: కిషన్ రెడ్డి
హైదరాబాదులో ఇంటి పన్నుల వసూలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇళ్ల ముందు చావు డప్పులు మోగిస్తున్నారని.... జనాలకు సహనం నశించిన రోజు కేసీఆర్ ఇంటి ముందు అదే డప్పును మోగిస్తారని హెచ్చరించారు. అధికారులకు దమ్ముంటే పాతబస్తీలో కూడా ఇదే రకంగా పన్నులు వసూలు చేయాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేవాలయాలకు కూడా ఆస్తి పన్ను నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు.