: ముందు దేశం మొత్తం చూడాలన్నారు... ఇప్పుడు లీగల్ గా ప్రొసీడవుతామంటున్నారు!: నిర్భయ తండ్రిపై విమర్శలు


ఢిల్లీ నిర్భయ ఉదంతంపై రూపొందించిన డాక్యుమెంటరీ వివాదంలో పరిణామాలు తొందరగా మారిపోయాయి. మహిళాదినోత్సవం రోజున ప్రసారం చేయాలని నిర్ణయించిన డాక్యుమెంటరీపై ఇంగ్లండ్ లో బీబీసీ కథనం ప్రసారం చేసింది. దీనిపై పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతకు ముందు నిర్భయ తండ్రి ఈ డాక్యుమెంటరీని భారత్ లోని ప్రతి వ్యక్తి చూడాలని ఆకాంక్షించారు. సమాజంలో ఉన్న మగాళ్ల ఆలోచనకు ముఖేష్ సింగ్ వ్యాఖ్యలు అద్దం పడతాయని, తమ క్షోభ వారికి అర్థం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తరువాత వివిధ వర్గాల స్పందన చూసి తన అభిప్రాయం మార్చుకున్నారో ఏమో కానీ, డాక్యుమెంటరీలో తమ పేర్లు వాడొద్దని చెప్పినా వాడారని, తక్షణం డాక్యుమెంటరీ ప్రసారం నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగని ఆయన, దీనిపై లీగల్ గా ప్రొసీడవుతామని అన్నారు. ఆయన ద్వంద్వ వైఖరిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల 8న ప్రసారం చేయాల్సిన డాక్యుమెంటరీని నిన్నే ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News