: నిరాహార దీక్ష విరమించిన జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి


వైకాపా అధినేత జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎట్టకేలకు తన నిరాహారదీక్షను విరమించారు. కడప జిల్లాకు తాగునీటి కోసం వీరపనాయనిపల్లిలో ఐదు రోజుల క్రితం ఆయన నిరాహార దీక్షకు దిగారు. అధికారపక్షం టీడీపీ మాత్రం ఆయన దీక్షను ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై వైకాపా నేతలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అసెంబ్లీ వేదికగా పలు పోరాటాలు చేయాల్సి ఉందని, దీక్ష విరమించాలని వైకాపా నేతలు రవీంద్రనాథ్ రెడ్డిని కోరారు. అయినా రవీంద్రనాథ్ రెడ్డి అంగీకరించలేదు. తన నిరాహారదీక్షను కొనసాగిస్తానని చెప్పారు. కానీ చివరకు, పార్టీ నేతల ఒత్తిడి, చేయాల్సిన పోరాటాల దృష్ట్యా ఎట్టకేలకు ఆయన దీక్షను విరమించారు. వైఎస్ వివేకానందరెడ్డి నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్షను విరమింపజేశారు.

  • Loading...

More Telugu News