: అక్షయ్ కుమార్, శిల్పాశెట్టిల జాయింట్ వ్యాపారం
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి శిల్పాశెట్టి చాలాకాలం తరువాత కలిశారు. ఇందుకు కారణం అక్షయ్ తో కలసి శిల్ప భర్త రాజ్ కుంద్రా ఓ కొత్త వ్యాపారం చేయబోతుండటమే. '24/7 సెలబ్రిటీ డ్రివెన్ హోమ్ షాపింగ్ ఛానల్' పేరుతో ఓ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేస్తున్నారు. దాని ప్రారంభోత్సవం సందర్భంగా అక్కీ, శిల్పాలు ఫోటోలకు ఫోజులిచ్చారు. 15ఏళ్ల కిందట వాళ్లిద్దరూ 'ధడ్కన్' అనే చిత్రంలో కలసి నటించారు. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించగా, శిల్ప, అక్షయ్ లపై పుకార్లు కూడా వచ్చాయి. విశేషమేమిటంటే ఈ చిత్రం విడుదలైన మరుసటి సంవత్సరమే అంటే 2001లో అక్షయ్ ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నాడు. 2009లో శిల్పాకు పెళ్లైంది.