: ధోనీ నుంచి నేర్చుకున్నా... టీమిండియాపై ప్రణాళికలున్నాయి: జాసన్ హోల్డర్


భారత జట్టును కూల్చే ప్రణాళికలు ఉన్నాయని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. భారత్-విండీస్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధోనీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ సారధ్యంలో ఆడానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓ జట్టు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ధోనీ నుంచి నేర్చుకున్నానని అన్నాడు. ధోనీ బాధ్యతాయుతమైన కెప్టెన్ అని హోల్డర్ పేర్కొన్నాడు. రేపటి మ్యాచ్ లో బలమైన భారత బ్యాటింగ్ లైనప్ ను కూల్చే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News