: నయనతార ఇంటికి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం: ఊటీ కార్పొరేషన్
సినీ నటి నయనతార ఇంటికి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తామని ఊటీ కార్పొరేషన్ హెచ్చరించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్ టెల్ రోడ్డు రాయల్ క్యాజిల్ అనే ప్రాంతంలో 122 ఇళ్లున్నాయి. వీటి యజమానులు పన్నులు ఎగ్గొడుతున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. రాయల్ క్యాజిల్ ప్రాంతంలో ఉంటున్న నటుడు జయరాం, నటి నయనతార, పలువురు బిజినెస్ మేన్ లు ఆస్తిపన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. దీంతో వారి ఇళ్లకు జప్తు నోటీసులు అందించారు. ఇకనైనా స్పందించకపోతే ముందుగా డ్రైనేజీ, వాటర్ కనెక్షన్లు తీసేస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ స్పందిచని పక్షంలో ఇళ్లను జప్తు చేస్తామని వారు తెలిపారు.