: ప్రత్యేక హోదా రాకపోతే అది ప్రజాప్రతినిధుల వైఫల్యమే
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాకపోతే అది ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్నట్టు కేంద్రం ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా పార్టీలకతీతంగా పోరాడాలని ఆయన సూచించారు. అన్ని పార్టీల నేతలు ఒకేసారి ప్రధానిని కలిసి, ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని ఆయన అన్నారు.